అంబేడ్కర్ భవన నిర్మాణానికి రూ.2 కోట్లు విడుదల చేయాలి: ఆదెన్న..ఎమ్మిగనూరులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవన నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేయాలని భవన నిర్మాణ కమిటీ ఛైర్మన్ కదిరికోట ఆదెన్న డిమాండ్ చేశారు. ఆదివారం ఎమ్మిగనూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.అంబేడ్కర్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించి, నిధులు విడుదల చేయడంలో జాప్యం చేయడం సరికాదన్నారు. దీనిపై ఈ నెల 13న దళిత సమ్మెళన సభ నిర్వహించనట్లు తెలిపారు.