కనిగిరి మండలంలో నడికుడి -శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మండలంలోని ఎడవల్లి వరకు పూర్తయిన రైల్వే ట్రాక్ పై రైల్వే శాఖ అధికారులు రైల్ ఇంజన్ తో ఆదివారం ట్రయల్ రన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి రైల్వే లైన్ నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ ఉండడంతో , అధికారులు రైల్వే నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. త్వరలోనే కనిగిరి ప్రాంత వాసులు రైలు ఎక్కి అవకాశం ఉంది.