సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఆర్టిఎఫ్ విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అధ్యాపకులు మంగళవారం మధ్యాహ్నం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ టి ఎఫ్ చెల్లించకుండా మొండివైఖరి వైస్తోందన్నారు. దీంతో ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో కొనసాగింపు ఇబ్బందికరంగా మారిందని వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు పాల్గొన్నారు.