ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆదివారం అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ వద్ద వినాయక మండపానికి వెళ్లి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల అనంతరం బయటకు రాని గోనుగుంట్ల ఎక్కువగా బిజినెస్ కార్యకలాపాలపై బెంగళూరులో ఉంటున్నారు. ఈరోజు వినాయక మండపం వద్ద కనిపించడంతో అభిమానులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.