ప్రజాప్రతినిధిగా తన పదవీకాలంలో నర్సాపురం పార్లమెంట్ పరిధిలో చిరస్మనీయంగా ప్రజలు గుర్తుపెట్టుకునే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. సోమవారం భీమవరంలోని కె ఎస్ రాజు ఫంక్షన్ హాల్ లో జిల్లా బిజెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ విలేకరులతో మాట్లాడారు. రికార్డ్ స్థాయి మెజార్టీతో గెలిపించిన నరసాపురం ప్రజలకు అభివృద్ధి అంకితం చేస్తా అని అన్నారు.