యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సిపి సుధీర్ బాబు ఆదేశాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం గణేష్ ఉత్సవాలపై కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏసీపీ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. గణేష్ నవరాత్రి ఉత్సవాలను, నిమర్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. మండప నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతి కొరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భారీ విగ్రహాలు ఏర్పాటు చేసేవారు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నిమర్జనం సమయంలో విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.