జిల్లా ఇంచార్జి మంత్రులు కేవలం ఆర్భాటాలతో పర్యటనలే కాకుండా ఇందూరు అభివృద్ధి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి హితవు పలికారు. వరద బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడంతో ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏంటో ప్రజలకు అర్థం అయిందని పేర్కొన్నారు.ఇందూరు నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మాట్లాడుతూ కామారెడ్డిలో బీసీ సభ పేరుతో మైనార్టీ సభ నిర్వహించడం దురదృష్టకరమన్నారు. వరద బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడం ప్రజల పట్ల శ్రద్ధ ఏంటో ప్రజలకు అర్థం అవుతోందన్నారు.