జీలుగుమిల్లి మండలం చంద్రమ్మ కాలనీలో ప్రమాదస్తు నిప్పురవ్వ అంటూకుని ఇల్లు అగ్నికి ఆహుతి అయినది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన కోర్స రమేష్ కూలీ పనుల నిమిత్తం పొలంలో ఉండగా ఇంటి సమీపంలో పిల్లలు బాణసంచా కాల్చుతుండగా నిప్పు రవ్వ ఇంటిపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి తాటాకిల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న బట్టలు, నగదు కాలిపోయినట్లు బాధితులు ఆవేదన చెందుతున్నారు.