కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా యువత గణేష్ మండపాలను ఏర్పాటు చేసి వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాయని అదే విధంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయడం కోసం,తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలవాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న గణేష్ మండపాల నిర్వాహకులను యువతను ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్ లు మాట్లాడుతూ యువత రక్తదానం పట్ల అవగాహనను పెంపొందించుకోవాలని కోరారు.