కాఫీ రైతుల సహకారంతో కాఫీ బెర్రీ బోరర్ నిర్మూలించవచ్చు, కాఫీ బెర్రీ బోరర్ గుర్తించిన వెంటనే అరికట్టే దిశగా చర్యలు చేపట్టాలని డ్వామా ప్రాజెక్ట్ అధికారి డా. విద్యాసాగర్ అన్నారు. డ్వామా ప్రాజెక్టు అధికారి శుక్రవారం అరకువ్యాలీ మండలం పాకనకుడ్డి గ్రామంలో కాఫీ బెర్రీ బోరర్ సోకి నష్టపోయిన కాఫీ రైతులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ చినలబుడు గ్రామపంచాయతీ పకనకుడి- 29 ఎకరాలు, మలివలస - 29 ఎకరాలు, మలసింగారం 07 ఎకరాలు, చినలబుడు 05 ఎకరాలు, తురాయికీయిడ - 02 ఎకరాలకు సోకినట్లు గుర్తించడం జరిగిందన్నారు.