నాగులుప్పలపాడు మండలం కనపర్తి వద్ద గణేష్ నిమజ్జనం ఉత్సవ చెరువును సీఐ శ్రీకాంత్ బాబు, ఎస్సై రజియా సుల్తానా గురువారం పరిశీలించారు. నిమజ్జనం ఉత్సవం సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేస్తూ అక్కడ ఫ్లెక్సీ ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ శ్రీకాంత్ బాబు మాట్లాడుతూ... గణేష్ నిమజ్జోత్సవాలను ప్రశాంతమైన వాతావరణం లో జరుపుకోవాలన్నారు నిర్వాహకులు నిమజ్జనోత్సవం సందర్భంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముందు జాగ్రత్త చర్యగా గజ ఈతగాలను సైతం ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు.