నల్గొండ జిల్లాలోని అన్ని మండల స్థాయిలలో ఈనెల 30లోగా ఎస్ జి ఎఫ్ క్రీడా పోటీలను పూర్తిచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి సూచించారు. బుధవారం రాత్రి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. అండర్ 14, 17 బాల బాలికల విభాగంలో నిర్వహించే కోకో, కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలలో బాల, బాలికలు పాల్గొనే విధంగా పిడీలు, పీఈటీలు చూడాలని, ఈ విషయంలో మండల విద్యాశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మండల స్థాయిలో ఎస్ జి ఎఫ్ క్రీడలను పూర్తి చేసి అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో పోటీలు జరుగుతాయని, అనంతరం జిల్లా స్థాయిలో సెప్టెంబర్ 4వ వారంలో జరుగుతాయని తెలిపారు.