భీంపూర్ మండలంలోని నిపానీ, అర్లి-టీ గ్రామాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం ఆకస్మి కంగా తనిఖీ చేశారు. మొబైల్ యాప్ లో చిత్రాలు తీస్తున్న తీరును పరిశీలించిన కలెక్టర్ స్వయంగా చిత్రం తీశారు. యాప్లో వివరాల నమోదులో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా? అని స్వయంగా పర్యవేక్షించారు. ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న అర్జీదారుల వివరాలను నెలా ఖరులోగా సేకరించాలని సూచిం చారు. పొరపాట్లకు తావులేకుండా యాప్లో వివరాలు నమోదు చేయాలన్నారు. కలెక్టర్ వెంట బీంపూర్ తహసిల్దార్, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.