బాపట్ల జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, చీఫ్ సెక్రటరీ విజయనగరం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ వెంకట మురళి పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలో ఉన్న ఎరువుల వివరాలను వారికి వివరించారు. రైతులకు సకాలంలో ఎరువులు అందుబాటులో ఉంచి, వారికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు.