మహబూబాబాద్ జిల్లా కురవి వాసి భూతం వెంకన్న నల్లేల్ల గ్రామ శివారులోని గణేశ్ కుంటలో మునిగి మృతి చెందాడని స్థానికులు సోమవారం సాయంత్రం 4:00 లకు తెలిపారు..ఆదివారం తన మిత్రుడితో చేపల వేటకు వెళ్లాడని, నీటిలో మునిగి ఎంతకూ బయటికి రాకపోవడంతో భయానికి గురైన అతడి మిత్రుడు సాయంత్రం ఇంటికి చేరుకొని ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా మద్యం తాగి పడుకున్నాడన్నారు. ఉదయం అతడిని నిలదీయగా ఆ నీటి కుంటలోనే మునిగిపోయాడని చెప్పడంతో కుటుంబసభ్యులు పోలీస్ లకు ఫిర్యాదు చేసారు.. దింతో పోలీసులు కుంట లో గలింపు చర్యలు చేపట్టారు.