Kandukur, Sri Potti Sriramulu Nellore | Aug 24, 2025
వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని, లింగాసముద్రం ఎస్ఐ నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయకుని గుడిలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించే వారు ఖచ్చితంగా నిభందనలు పాటించాల్సి ఉంటుందని ఆయన కోరారు.