కుటుంబ కలహాల నేపథ్యంలో చీరాల టిడిపి నేత గుంటూరు మాధవరావుపై గురువారం సాయంత్రం దాడి జరిగింది.తాను ద్విచక్ర వాహనంపై అద్దంకి నుండి వస్తుండగా చందలూరు వద్ద నిర్మానుష్య ప్రదేశంలో తన వియ్యంకుడు కూర్మాల శ్రీనివాసరావు పెద్ద కుమారుడు ధీరజ్,మరికొందరు తనను అడ్డగించి సుత్తితో కొట్టారని మాధవరావు చెప్పారు.గాయాలతో చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు చేరిన మాధవరావు ఈ మేరకు అవుట్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.