రైతు సేవా కేంద్రం వద్ద ఎరువుల కోసం రైతులు ఎగబడుతున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలో గల బుచ్చయ్యపేట మండలం రాజాం సచివాలయం పరిధిలోని రాజాం, నీలకంఠాపురం గ్రామాల రైతులకు 250 బస్తాల యూరియాను వ్యవసాయాధికారులు ఆర్ఎస్కే వద్ద సిద్ధం చేశారు. ప్రస్తుతం యూరియాకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో రైతులు తెల్లవారు నుండే యూరియా కోసం రైతు సేవా కేంద్రం వద్ద కాపు కాసారు. పోలీస్ బందోబస్తు నడుమ అధికారులు ఎరువులు పంపిణీ చేస్తున్నారు.