కరీంనగర్ రజ్విచమన్ ప్రాంతంలో కోతుల దాడిలో ఓ వ్యక్తికి గాయాలైనట్లు స్థానికులు ఆదివారం తెలిపారు. నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిపై కోతులు దాడి చేయగా,తీవ్ర గాయాలు కావడంతో స్థానిక కాలనీ వాసి మహమ్మద్ పాషా గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతున్నాడని, తన పేరు వివరాలు తెలపడానికి స్పృహలోకి రాలేదని తెలిపారు.