సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు గత నాలుగు నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతనాల సలహా మండలిలో నిర్ణయించి అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన సిఫారసులను ఆమోదించి తక్షణమే అమలకు చర్యలు తీసుకోవాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ - ఎఐటియుసి కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య,ఉపాధ్యక్షులు కృష్ణ పర్ లు డిమాండ్ చేశారు.బుధవారం నాడు కొత్తగూడెం కార్మికుల పని ప్రదేశాల్లో ఆందోళన చేపట్టారు..