Kavali, Sri Potti Sriramulu Nellore | Sep 10, 2025
కార్మికుల సమస్యల పట్ల, వారి హక్కులు కాపాడడంలో నిత్యం వారికి అండగా నిలిచిన వ్యక్తి కామ్రేడ్ డేగా సత్యం అని పలువురు వామపక్ష నేతలు ఆయన చేసిన సేవలను కొనియాడారు. నెల్లూరు జిల్లా కావలిలో డేగా సత్యం మూడో వర్ధంతి కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల ప్రాంతంలో జరిగింది. ఆయన చిత్ర పటానికి వామపక్ష నేతలు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుమారులు చంద్ర, సాయిలు అన్న క్యాంటీన్ లో పేదలకు ఉచిత అన్నదానం చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ధామా అంకయ్య, జనసేన నాయకులు రిషి మాట్లాడారు.