పలమనేరు: మున్సిపల్ కార్యాలయం నందు గురువారం జరిగిన మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లు మాట్లాడుతూ, పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు స్థలాలు కబ్జాకు గురైన నేపథ్యంలో ఉన్నవాటినైనా కాపాడుకోవాలని సూచించారు. పలు అంశాలపై కౌన్సిలర్లు మండిపడ్డారు. కాగా అధికారులు సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని బదులిచ్చారు.