ఎగువ ప్రాంతంతోపాటు వేములవాడ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాల కారణంగా శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారం,వేములవాడ, బావుసాయిపేట వెంకట్రావుపేట మూలవాగులు మత్తడి దూకుతున్నాయి.దీంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.ఈ దృశ్యాలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి.భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.వాగులు,వంకలు,చెరువులు జలకళను సంకరించుకున్నాయి.వరదల ప్రాంతాలకు జనాలు ఎవరు కూడా వెళ్లవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.