గోండులిపిని బయటి ప్రపంచానికి తెలియజేయడంతో జంగు ప్రముఖ పాత్ర పోషించారు. ఈ లిపి కి సంబంధించిన ప్రతులు భద్రంగా దాచి ప్రస్తుత తరానికి అందించారు. గోండి భాష అభివృద్ది కోసం, చిన్నారుల కోసం గోండి-తెలుగు వాచకాలను ప్రచురించి విద్యా బోధన చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 14 పాఠశాలలను నెలకొల్పి 400 మంది విద్యార్థులకు గోండిలిపిలో విద్యా బోధన చేశారు. గోండి లిపి లో 2014 లో మొదటి వాచకం, 2016 లో రెండో వాచకం రాశారు. మారుమూల ఆదివాసీ గ్రామాల్లో ఉండే చిన్నారులు వారి మాత్రు భాషలోనే చదివే విధంగా విద్యాభివృద్దికి బాటాలు వేశారు.