బైరెడ్డిపల్లి: మండలం దేవదొడ్డి గ్రామంలో ని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తాకరానిచోట తాకి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని విద్యార్థినిలు నేషనల్ హ్యూమన్ రైట్స్ & క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ దృష్టికి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న NHRCCF సిబ్బంది సదురు పాఠశాలకు వెళ్లగా విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. వెంటనే పోలీస్ అధికారులు స్పందించి కీచక ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి ఫోక్సో కేసు నమోదు చేయాలన్నారు. ఇప్పుడు మండలానికి ఇద్దరు ఎంఈవోలు ఉన్నారు ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలన్నారు.