ముదిగుబ్బ మండలం జొన్నల కొత్తపల్లి వద్ద అనంతపురం చెన్నై జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఒక కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. అనంతపురం పట్టణానికి చెందిన రఘు అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో తిరుపతి నుంచి అనంతపురం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.