ఉపాధ్యాయుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని యూటిఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తుమ్మల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం బాపట్ల ఎన్జీవో హోంలో యూటిఎఫ్ శాఖ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన ప్రభుత్వంలో ఆర్థిక విషయాలు నేటి వరకు పరిష్కారం కాలేదన్నారు. బోధనేతర పనులతో పని ఒత్తిడిని అధికం చేస్తున్నారన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ 25న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.