Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 26, 2025
కావలి 9వ వార్డులో జనసేన జనరల్ సెక్రెటరీ తోట చరణ్ ఆధ్వర్యంలో మంగళవారం వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. పర్యావరణం పరిరక్షణ కోసం ఈ మట్టి విగ్రహాలలో పండ్లు, పువ్వులు విత్తనాలను ఉంచి విగ్రహాలు తయారు చేసి ప్రతి ఇంటికి అందజేశారు. జనసేన పట్టణ అధ్యక్షుడు సాయి, వార్డు ఇన్ఛార్జ్ తుమ్మల కృష్ణ వెంకటసుబ్బయ్య, పద్మావతి శ్రీదేవి, కవిత, సాజిద్ ఉన్నారు.ఈ కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగింది.