అనంతపురం నగరంలోని రాంనగర్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నగరానికి చేరుకొని ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలీసులు లాఠీ ఝులిపించారు. వారిని అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో అనంతపురం నగరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాంనగర్ ప్రాంతంలోని వ్యాపార సముదాయాలను పోలీసులు బంద్ చేయించారు. ప్రస్తుతం అనంతపురం నగరంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.