మఠంపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన భయబ్రాంతులకు గురి చేసింది. యాదాద్రి టౌన్షిప్ సమీపంలోని కంపచెట్లలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల వివరాలు అతను మతిస్థిమితం లేని స్థితిలో మఠంపల్లి ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగించేవాడని తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు