పెద్దవడుగూరు మండలం కాసేపల్లి టోల్ గేట్ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న గోవులు పట్టివేత. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని కాసేపల్లి టోల్ గేట్ వద్ద గోవులను తరలిస్తున్న కంటైనర్ లారీని బీజేపీ నాయకులు పట్టుకున్నారు. కంటైనర్ లారీలో అక్రమంగా గోవులను తరలిస్తున్నారన్న విషయం తెలుసుకున్న గుత్తి మండల బీజేపీ నాయకులు సోమవారం అక్కడికి చేరుకొని లారీని నిలిపివేశారు. పక్కా సమాచారం మేరకు పార్వతిపురం నుంచి హిందూపురంకు తరలిస్తున్న భారీ కంటైనర్ ను బీజేపీ నాయకులు తెగదొడ్డి తిమ్మారెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, నారాయణ రెడ్డి, హిందూ అనుబంధ సంస్థల నాయకులు పట్టుకున్నారు.