చిత్తూరు జిల్లా. పుంగనూరు మండలం పాలంపల్లి పంచాయతీ. మల్లుపల్లి గ్రామ సమీపంలో ఓ మామిడి తోటలో దాదాపు 45 సంవత్సరాల మగ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెంది ఉండదాన్ని స్థానికులు గుర్తించి పుంగునూరు సమాచారం తెలిపారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పంచనామ నిమిత్తం పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఘటన గురువారం సాయంత్రం 6 గంటలకు వెలుగులో వచ్చింది.