ఈ సంవత్సరం నాలుగోసారి శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేశారు అధికారులు. మొన్న మంగళవారానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో, అధికారులు అన్ని గేట్లు మూసివేశారు. అయితే మళ్లీ స్వల్పంగా వరద ప్రవాహం పెరగడంతో జలాశయంలోని రెండు గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువ నాగర్జున్ సార్ కు నీటిని విడుదల చేశారు. ఈ సంవత్సరం ఇది నాలుగోసారి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం అధికారులు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో1,62,767 క్యూసెక్కులు,ఔట్ ఫ్లో : 1,21,330 క్యూసెక్కులు కాగపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు ప్రస్తుతం: 883.80 అడుగులుగా ఉంది.