జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని మేడిపల్లి మండల కేంద్రంలో మేడిపల్లి భీమారం మండలాల పరిధిలోని అర్హులైన 50 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని మేడిపల్లి,భీమారం మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో నెలకొల్పిన గణనాథులను స్థానిక నాయకులతో కలసి రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమ కోసం ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.