ధర్మవరం ఎన్జీవో కార్యాలయంలో ఆదివారం ఆత్మీయ సేవా ట్రస్టు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం అవార్డుల ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ నటుడు నాగినీడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులపై ఎక్కువ చదువు మార్కులు వంటి భారాన్ని మోపురాదని ముఖ్యంగా 18 సంవత్సరాలు వయసు లోపల ఉన్నవారికి స్వేచ్ఛ స్వాతంత్రం ఉండాలన్నారు.