అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోగల బుచ్చయ్య పేటలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కేపీ అగ్రహారానికి చెందిన జొన్నపల్లి ఈశ్వర రావు బుచ్చయ్యపేట మెయిన్ రోడ్డులో నడిచి వెళుతుండగా బస్సు ఢీ కొట్టింది. బస్సు వెనక చక్రాల కింద పడడంతో ఈశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదుతో ఎస్ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు.