Kandukur, Sri Potti Sriramulu Nellore | Sep 8, 2025
రైతులు యూరియాను అధికంగా వాడవద్దని మండల వ్యవసాయ అధికారి కె.వి. శేషారెడ్డి సూచించారు. సోమవారం వలేటివారిపాలెం మండలం అమ్మవారిపాలెంలో నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. యూరియా అధిక వాడకం వల్ల భూమి నిస్సారం అవడం, చీడపీడలు పెరగడం, సూక్ష్మజీవులు తగ్గిపోవడం వంటి నష్టాలు కలుగుతాయని హెచ్చరించారు. నానో యూరియా ప్రయోజనాలను వివరించి, రైతులకు PMDS కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జరిగింది.