నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ఉద్రత వాతావరణం చోటు చేసుకుంది అర్హత ఉన్న పింఛన్లు తొలగించారని నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దివ్యాంగులు ధర్నాకు దిగారు. దివ్యాంగుల జేఏసీ ఆధ్వర్యంలో సుమారు 300 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్డుకు అడ్డంగా కూర్చొని ధర్నా చేస్తున్న వికలాంగులను పోలీసులు పక్కకు లాగిపారేశారు. అన్యాయంగా తొలగించిన పెన్షన్లను వెంటనే ఇవ్వాలని దివ్యాంగుల జేఏసీ సభ్యులు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. అనంతరం డిఆర్డిఏ పిడి శ్రీధర్ రెడ్డి డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు