విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో NDPS చట్టం ప్రకారం నమోదై, దర్యాప్తులో ఉన్న గంజాయి కేసులను ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం తన కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫెరెన్స్‌లో సమీక్షించారు. పెండింగులో ఉన్న కేసుల్లో నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. పరారీలో ఉన్న నిందితుల సమాచారం సేకరించాలని, వారి ఆచూకీని గుర్తించేందుకు సాంకేతికతను వినియోగించాలని ఎస్పీ సూచించారు.గంజాయిని సరఫరా చేసిన వ్యక్తులు, విక్రయించిన వ్యక్తులను, ఇతర ప్రధాన నిందితులను కూడా ఆయా కేసుల్లో నిందితులుగాచేర్చాలన్నారు. గంజాయి కేసుల్లో అర్హులైన నిందితులపై పి.డి.యాక్టు ప్రయోగించేందుకు ప్రతిపాదనలు పంపాలన్నారు.