ప్రభుత్వ వైద్య కళాశాలలను, ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రైవేటీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని సీపీఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు కడప నగరంలోని సిపిఎం ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొత్తగా మంజూరైన వైద్య కళాశాలల నిర్మాణాన్ని, నిర్వహణను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.