భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్న బయ్యారం పోలీసులు మహబూబాబాద్ జిల్లా, బయ్యారం మండల కేంద్రంలో ఈరోజు మంగళవారం ,బస్టాండ్ సెంటర్ వద్ద అనుమానస్పదంగా ఇద్దరు వ్యక్తులు సూట్ కేస్తో సంచరిస్తుండగా, బయ్యారం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ,వారిని అదుపులోకి తీసుకున్నారు. సూట్ కేసులో భారీగా గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో ఇరువురిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. గంజాయి ఎన్నికేజీలు, వ్యక్తులు ఎవరు అనే వివరాలు తెలియాల్సి ఉంది.