రామచంద్రపురం నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో కాకినాడ జిల్లాలో కలపాలనే డిమాండ్ నియోజకవర్గంలో విస్తృతంగా ఉందని జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు పేర్కొన్నారు. గురువారం గొల్లపాలెం లో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాజులూరు మండలం నియోజకవర్గ పరంగా రామచంద్రపురం లోను, జిల్లా పరంగా కాకినాడలో ఉన్నప్పటికీ ఆ మండల ప్రజలు కూడా మద్దతు పలకడం హర్షణీయమన్నారు.