యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలను పురస్కరించుకొని నిర్వహించిన ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. ఆయన ఉపాధ్యాయుని గానే కాకుండా రాష్ట్రపతిగా పనిచేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కరరావు, డీఈవో సత్యనారాయణ, ఉపాధ్యాయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.