వరంగల్ జిల్లా నల్లబెల్లి తహసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ కల్పన సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు సిబ్బంది. అధికార పార్టీకి చెందిన నాయకుడు చరణ్ సింగ్ జూనియర్ అసిస్టెంట్ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో తనపై అన్యాయంగా ఫిర్యాదు చేశారంటూ ఎమ్మార్వో కల్పన మొరపెట్టుకుంది. ఎమ్మార్వో సైతం కల్పనను పట్టించుకోలేదని ఆవేదన చెందిన కల్పన తాసిల్దార్ కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతుంది.