ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో వైద్యాధికారి ప్రణీత్ కుమార్ తన సిబ్బందితో 3 కిలోమీటర్లు నడిచి వైద్య శిబిరం నిర్వహించారు. బుధవారం ఉదయం దొడ్ల వద్ద జంపన్నవాగు ఉధృతి కారణంగా పడవ ద్వారా వాగు దాటి అక్కడ నుంచి కొండాయి గ్రామానికి 3 కిలోమీటర్ల మేరా కాలినడకన వెళ్లి వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు.