నరసాపురం-సఖినేటిపల్లి రేవులో పంటు, పడవలపై రాకపోకలు పూర్తిగా నిలిపివేసినట్లు నరసాపురం తహశీల్దార్ ఐవివి సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన పంటిరేవులో గోదావరి ఉదృతను పరిశీలించి మాట్లాడారు. జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాలు మేరకు పంటి నిర్వాహాకులకు నోటీసులు అందజేశామన్నారు. తిరిగి ఆదేశాలు ఇచ్చే వరకు పంటి రవాణా నిలిపివేయాలన్నారు. నిరంతరం రెవిన్యూ, పోలీసు, ఫైర్ శాఖల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.