ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాల వల్ల కరీంనగర్ నగరంలోని లోయర్ మానేరు జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని ఎల్ఎండి అధికారులు బుధవారం తెలిపారు. సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరు నుంచి వరద మధ్య మానేరుకు నీటి వరద ఉధృతంగా వస్తుండడంతో ఇరిగేషన్ అధికారుల ఆదేశాల మేరకు మధ్య మానేరు జలాశయం ఆరు గేట్లను ఎత్తి కరీంనగర్ లోని లోయర్ మానేరు జలాశయానికి నీటిని వదులుతున్నారు. ఎల్ఎండి జలాశయం పూర్తి నేటి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా,ప్రస్తుతం 11 టీఎంసీల వద్ద కొనసాగుతుంది. వరద ఇలాగే రెండు రోజుల వరకు కొనసాగితే జలాశయం పూర్తిస్థాయిలో నిండి నిండుకుండలా ఉండే అవకాశం ఉందన్నారు.