మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం భీమవరంలో స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో సిపిఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి. గోపాలన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం మాట్లాడుతూ వైద్య విద్య ప్రభుత్వ రంగంలోనే ఉంటే ప్రజానీకానికి, రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. వైద్యరంగం ప్రభుత్వ రంగంలో ఉన్న అనేక దేశాల్లో వైద్య సదుపాయాలు ప్రజలకు ఎలా అందించబడుతున్నాయో, కార్పొరేట్ల పరమైతే ప్రజలకు ఎలా ఖరీదుగా మారుతుందో కరోనా సమయంలో మనందరికీ తెలిసిందన్నారు.