నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యావరణ పరిరక్షణకు మట్టితో చేసిన వినాయక ప్రతిమలను ప్రతిష్టించాలని సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో ఆమె మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజలకు, ఉద్యోగులకు ఈ ప్రతిమలను ఉచితంగా అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ఇది ఒక ముఖ్యమైన అడుగు అని ఆమె పేర్కొన్నారు.