రామచంద్రపురం లోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య పనులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ రాజు తో తడి, పొడి చెత్త నిర్వహణపై మంత్రి చర్చించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.